నెలాఖరులో ‘మహా’ ఒప్పందం

C

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): నెలాఖరులో ‘మహా’ ఒప్పందం.    తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈ నెలాఖరులో సాగు నీటిపాజెక్టులప ఒప్పందం జరగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఈ మేరకు సన్నాహాలు సాగుతున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి తుమ్మిడి హెట్టి, మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది.  మహారాష్ట్రతో టి సర్కార్‌ పలు దఫాలు చర్చలు జరిగాయి.  రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తుమ్మడి హెట్టి ప్రాజెక్టు స్థలం ఉన్నది.మేడిగడ్డకు సైతం ఇలాంటి సమస్యలున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు పలుమార్లు బముంబయికి వెళ్లి అక్కడి ఇరిగేషన్‌ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారుల బృందం నాగపూర్‌, చంద్రంపూర్‌, ముంబైకి వెళ్ళి అక్కడి అధికారులతో చర్చించారు.  పహారాష్ట్ర, తెలంగాణ మధ్య సూత్రప్రాయ ఒప్పందాలు జరిగాయి. వీటి నేపధ్యంలో హైదరాబాద్‌ లో రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖల ముఖ్యకార్యదర్శి లు, ఇతర ఉన్నతాధికారులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రోజంతా సమావేశమై అన్ని అంశాలను చర్చించారు. మహారాష్ట్ర అనుమానాలను తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు నివృత్తి చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినపుడే మహారాష్ట్రతో త్వరలో తుది ఒప్పందాలు జరుగుతాయని సీఎం ప్రకటించారు. తుమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ప్రాజెక్టు గ్రావిటీ స్కీం  కాదు. ఇది లిఫ్టు స్కీం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల  ప్యాకేజీ 5 లో 72 కి.విూ. వద్ద 160 టిఎంసిల నీరు 39 విూ. లిఫ్టు చేయడం వల్లనే ఎల్లంపల్లికి చేరుతాయి. ఆదిలాబాద్లోని 56,500 ఎకరాలలో 36,000 ఎకరాల ఆయకట్టు ఈ లిఫ్టు తర్వాతే ఉంటుంది. రీ ఇంజనీరింగ్‌ లో భాగంగా లిఫ్టు మేడిగడ్డకు మారుతున్నది. అక్కడి నుంచి వరుస బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి చేర్చనున్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెబుతోన్న 152 విూటర్ల ఎత్తు విషయంలో మహారాష్ట్ర  ఏనాడు ఒప్పుకోలేదు. ఈ ఎత్తు ప్రాజక్టు నిర్మించడం పట్ల   మహారాష్ట్రకు అభ్యూతరాలున్నవి . ఇందుకు ముంపు సమస్య ప్రధానం. 152 విూటర్ల ఎత్తులో ప్రాజక్టు నిర్మించడాన్ని అంగీకరించబోమని 148 విూటర్ల పతే తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి విజయ శివ్‌ తారే 2015 మే 14న మొదటిసారిగా అధికారికంగా ప్రకటించారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత   273 టిఎంసిలు కాదని 165 టీఎంసీల ని కేంద్ర జల సంఘం లెక్కగట్టింది. 160 టిఎం సీల   నీటి తరలింపు సాధ్యం కానందున 120 టీఎంసీల  నీటిని తరలించడానికి తెలంగాణ, మహారాష్ట్ర సూత్ర ప్రాయంగా   అవగాహనకు వచ్చాయి. ఇక మేడి గడ్డ వద్ద 100 విూటర్లకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. తుమ్మిడి హట్టి వద్ద  బ్యారేజీ సామర్ధ్యం 1.85 టీఎంసీలు కాగా మేడిగడ్డ వద్ద సులభంగా 16 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ లభిస్తోంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు సానుకూల వైఖరితో, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని   ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్మిస్తుండగా విపక్షాలు, కొనీదరు ప్రజాసనీఘాల నేతలు అవగాహన రాహిత్యంతో ప్రకటనలు చేస్తున్నారని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు సోమవారంనాడు ఒక ప్రకటనలో విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం రీ ఇంజనీరింగ్‌ ద్వారా చేపడుతున్న మటి ప్రాజెక్టు

నిపుణుల మద్దతు :

సాగునీటి రంగ నిపుణుడు టి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని గట్టిగా సమర్థించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ఆయన  ప్రాయపడ్డారు. మొదటి దశలో మేడిగడ్డ (కాళేశ్వరం) నుంచి ఎల్లంపల్లి వరకు 3 బ్యారేజీ లు నిర్మించేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండో దశలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజవర్గంలో తడ్కపల్లి లో50 టిఎంసిలు , కొండపోచమ్మ వద్ద 21టిఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పినీచింది. తెలంగాణ ప్రభుత్వం రీ ఇంజనీరింగ్‌ తో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల పోరం సంపూర్ణ మద్దతు తెలిపింది. త్వరలోనే తమ సమావేశం తీర్మానాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు ఇవ్వనున్నట్టు పోరం తెలిపింది.రీ ఇంజనీరింగ్‌, రీ డిజైన్‌ తో సాగునీటి ప్రాజక్టులు నిర్మించి వచ్చే అయిదేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు సీఎం కెసిఆర్‌, ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  ప్రాణహిత చేవెళ్ల డిజైన్లో భాగంగా 44 కిలోవిూటర్ల మేరకు కాలువలు తవ్వారు. పలు నిర్మాణాలు కూడా జరిగాయి.  ఈ కెనాల్‌ ప్రిజమ్‌ నే రిజర్వాయర్‌ గా వాడుకోవాలని ప్రభుత్వం రీ డిజైను చేసింది. 44 కిలో విూటర్ల పొడవునా కాలువే రిజర్వాయర్‌ గా మారుతున్న ది.తుమ్మిడిహట్టి నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించడంతో పాటు  భూగర్భజలాల పెంపు కోసం కూడా ఈ కాలువలు పనిచేస్తాయి.కెసిఆర్‌ సర్కార్‌ చేపట్టిన రీ ఇంజనీరింగ్‌ పై అపోహలు వద్దని నిపుణులు అంటున్నారు.  స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో కెసిఆర్‌, హరీష్‌ చేస్తున్న సాగునీటి యజ్ఞానికి నిపుణులు సంపూర్ణ సహకారం ఇస్తామని ముందుకొస్తున్నారు. పక్కగా, ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయ పద్ధతిలో రీ ఇంజనీరింగ్‌ జరిగిందని   పలువురు నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో రీ ఇంజనీరింగ్‌ చేపడుతున్న అన్ని ప్రాజెక్టులలోనూ ‘రివర్స్‌ బుల్‌ పంపులు” వాడితే జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసుకోచ్చునని సాగునీటి రంగ నిపుణుడు టి. హనుమంతరావు చేసిన సూచనను తప్పక పరిగణనలోకి తీసుకుంటామని హరీష్‌ రావు అన్నారు.భారీ ప్రాజెక్టుల మధ్య గోదావరి నదీ పరివాహక ప్రాంతం లో నాకా యానం దృష్టిలో పెట్టుకొని లాకుల నిర్మాణాలు చేపట్టే సూచన పై మంత్రి హరీష్‌ ధృష్టి పెట్టారు. నేకాయాన శాఖ అనుమతి, నిధుల కేటాయింపు కోసం కేంద్రం తో సంప్రదినీచేందుకు మంత్రి హరీష్‌ రావు ప్రయత్మిస్తున్నారు.