వెనెజువెలాలో అమెరికా భీకర దాడులు..

అమెరికా నిర్భంధంలో అధ్యక్షుడు మదురో
శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు
దేశంలో అత్యయిక పరిస్థితి విధింపు
ట్రంప్‌ ఆదేశాలతోనే తమ సైన్యంతో దాడులు చేశామన్న అగ్రరాజ్యం
కరాకస్‌(జనంసాక్షి):వెనెజువెలా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అగ్రరాజ్యం అమెరికా ఈ దాడులకు దిగింది. రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో దేశంలో అత్యయిక పరిస్థితి విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్‌ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ విూడియా కథనాలు వెల్లడిరచాయి.
సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా శనివారం దాడులకు పాల్పడినట్లు వెనెజువెలా వెల్లడిరచింది. దీంతో సైనిక స్థావరాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిరదని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సవిూక్షించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ దాడులతో దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమెరికన్‌ ఎయిర్‌లైన్లకు సూచన
ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కీలక సూచన చేసింది. వెనెజువెలా గగనతలాన్ని వినియోగించొద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనెజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్నారు. ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు కూడా సంబంధాలున్నాయని ఆరోపిస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్‌ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్‌ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను మోహరించింది.

మదురో మా కస్టడీలోనే
` వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని దేశం వెలుపలకు తరలించాం
` ప్రకటించిన ట్రంప్‌
` వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వండి
` అమెరికాను డిమాండ్‌ చేసిన వెనెజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌ డిమాండ్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా` వెనెజువెలా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యూఎస్‌ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్‌పై భీకరదాడులు జరిపిన సంగతి తెలిసిందే వాటిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ధ్రువీకరించారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని వెల్లడిరచారు. వారిద్దరిని వెనెజువెలా వెలుపలకు తరలించినట్లు వెల్లడిరచారు. దీనిపై అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు విూడియా సమావేశం నిర్వహించనున్నామని తన ట్రూత్‌ సోషల్‌ విూడియా వేదికగా ట్రంప్‌ పోస్టు చేశారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌లో భాగమైంది.
వారి ఆధారాలు ఇవ్వండి: ఉపాధ్యక్షుడు
తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనెజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌ స్పందించారు. మదురో, ఆయన సతీమణి ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్‌ చేశారు. 1989 తర్వాత ఒక లాటిన్‌ అమెరికన్‌ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ ఏడాది పనామాపై దాడిచేసి, మిలిటరీ నేత మాన్యుయెల్‌ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది. ఈ పరిణామాల వేళ వెనెజువెలా పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది.
ఇక సైనిక దాడులు చేయబోం: అమెరికా
మదురో అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనెజువెలాలో తమ సైనిక చర్య పూర్తయిందని యూఎస్‌ సెనెటర్‌ మైక్‌ లీ వెల్లడిరచారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఈ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ చమురు కోసమే అమెరికా దాడులు చేయనుందని గతంలో వెనెజువెలా ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా.. గతంలోనే తాను దేశాన్ని వీడేందుకు సిద్ధమని మదురో చెప్పినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. తాను, తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేశారని వాటి సారాంశం. యూఎస్‌ విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసులను మూసివేయడం వంటి వాటి గురించి వాషింగ్టన్‌ వద్ద ప్రస్తావించినట్లు వెల్లడిరచాయి