భోజేర్వు పాఠశాలకు రూ.20 వేల మినీ వాటర్ ప్లాంట్ బహుకరణ

 

 

 

 

 

 

 

ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్

చెన్నారావుపేట, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని భోజేర్వు ప్రభుత్వ పాఠశాలకు రూ.20 వేల మినీ వాటర్ ప్లాంట్ ను చెన్నారావుపేట ఆశాజ్యోతి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్డ వెంకటలక్ష్మి బహుకరించారు. శనివారం పాఠశాలలో మినీ వాటర్ ప్లాంట్ ను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. ఈ మినీ వాటర్ ప్లాంట్ ను గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మినీ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా దొడ్డ వెంకటలక్ష్మిని గ్రామ సర్పంచ్ సతీష్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పెద్దబోయిన ఎల్లయ్య, మాజీ సర్పంచ్ పిండి విజయ బిక్షపతి, వార్డు సభ్యులు ఇట్టబోయిన రాజు, పేరెంట్స్ కమిటీ సలహాదారులు నూకల కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్ర రవీందర్, ఉపాధ్యాయులు పరమేశ్వర్, రాజు, రమేష్, శ్వేతశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.