మీరప్పుడు చేసిందే.. మీమిప్పుడు చేస్తున్నాం
ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు మీరు హాజరయ్యారా?:హరీశ్ రావు
హైదరాబాద్(జనంసాక్షి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుందా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా 30`03`2016 న విూరు స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా? అని నిలదీశారు. అసెంబ్లీలో ఆడియో`విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోమని నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా లేఖ రాసి.. నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాలులో ప్రజెంటేషన్‌కు సిద్ధపడటం.. విూ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఆ ఉత్తరంపై నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పద్మావతి సంతకాలు చేశారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనైతికత, ద్వంద్వ ప్రమాణాలను ఈ ఒక్క ఉత్తరం బట్టబయలు చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్ఫూర్తి వంటి మాటలు వ్లలెవేస్తారని.. అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారని మండిపడ్డారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజమని వ్యాఖ్యానించారు. అధికార పక్షానికి ప్రజెంటేషన్‌కు అనుమతినిస్తే.. బీఆర్‌ఎస్‌కూ అదేవిధంగా అనుమతి ఇవ్వాలని బీఏసీ సమావేశంలో, ఉత్తరం ద్వారా స్పీకర్‌ను కోరామని హరీశ్‌రావు తెలిపారు. అయినప్పటికీ ఆ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్‌ఎస్ పార్టీకి మధ్య ఉన్న అసలు తేడా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ.. రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని తన మార్పుగా చూపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ మార్పు అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


