మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ సభ్యుడు బర్సే సుక్కా లొంగుబాటు..

` రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు కూడా..
` భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం
` వాటిలో హెలికాప్టర్‌లను సైతం కూల్చే భారీ ఆయుధం
` మీడియాకు వివరాలు వెల్లడిరచిన డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): మావోయిస్టు అగ్రనేత బర్సే సుక్కా అలియాస్‌ దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. నిన్ననే లొంగిపోగా.. ఆ వివరాలను డీజీపీ శనివారం విూడియాకు వెల్లడిరచారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్‌గా దేవా పని చేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్‌జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు.‘‘దేవా.. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వాడు. ఎన్‌ఐఏ నుంచి దేవాపై రూ.75లక్షల రివార్డు ఉంది. ఆవులం సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్యా, మంకు, అండా, తెలంగాణ స్టేట్‌ కమిటీ సభ్యురాలు అడ్లూరి ఈశ్వరి లొంగిపోయినవారిలో ఉన్నారు. యూఎస్‌ఏ తయారీ కోల్ట్‌ ఆయుధంతో వచ్చారు. ఇజ్రాయెల్‌ దేశంలో తయారు చేసిన టవర్‌ ఆయధం కూడా ఉంది. ఎనిమిది ఏకే 47 గన్స్‌ స్వాదీనం చేసుకున్నాం. 8, నాలుగు బ్యారేల్‌ గ్రానైడ్‌ లాంచర్స్‌ ఆయుధాలను సమర్పించారు. హెలికాప్టర్‌ను సైతం కూల్చే భారీ ఆయుధం సైతం తీసుకు వచ్చారు.పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం 66 మంది మాత్రమే మిగిలారు. పీఎల్‌జీఏ పూర్తిగా క్షీణించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కిష్టంపేట్‌కు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా రాష్ట్రానికి చెందిన ఒక్కరు మాత్రమే స్టేట్‌ కమిటీలో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో మావోయిస్టులు ఆత్మ సమర్పణ చేసుకున్నారు. డివిజన్‌ సభ్యులకు రూ.5లక్షలు, ఏరియా సభ్యులకు రూ.4లక్షలు, మిగతా సభ్యులకు రూ.లక్ష రివార్డు ఉంది. రూ.1.80 కోట్ల రివార్డు లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఇస్తాం. ఇప్పటి వరకు తెలంగాణలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్‌జీఏ సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం’’ అని డీజీపీ తెలిపారు.

 

సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌
` ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి
` భారీగా ఆయుధాలు స్వాధీనం
సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడిరచారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే`47, ఇన్సాస్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి చెందారు.మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కిష్టారం పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం సుక్మా జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో పామ్లూరు గ్రామం సవిూపంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మంగడు మినహా మిగతా వారి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు.. బీజాపుర్‌ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడిరచారు. కాగా.. గత ఏడాది జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 285 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు