నేటి నుంచి జగన్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేటి నుంచి విచారించనుంది. విచారణకు సీబీఐ కోర్టు నిన్న  లనుమతి ఇవ్వడంతో  ఈడీ అధికారులు ఈ రోజు నుంచి 21 వరకు జగన్‌ను ప్రశ్నించనున్నారు.ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టనున్నారు.