నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు దరాఖాస్తు చేశారని ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ మన్మధరెడ్డి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1119 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అన్నారు.