నేటి నుంచి రైల్వే మార్గానికి మరమ్మతులు

సికింద్రాబాద్‌:ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ మార్గంలో రైల్వే మార్గంలో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మంగళ,శుక్రవారాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ప్రకటనలో తెలిపారు.
నెంబరు 17201 గుంటూరు సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరిలోనే నిలిపివేస్తారు.సికింద్రాబాద్‌,భువనగిరి మద్య రద్దు చేసి,అక్కడి నుంచే రైలును నడుపుదాతారు.హైదరాబాద్‌-వరంగల్‌ ల మద్య నడిచే నెంబరు 67267/266 పుష్‌పుల్‌ రైళ్లను ఫలక్‌నామా-భువనగిరి మద్యనడిచే 67277 పుష్‌పుల్‌ రైళ్లను రద్దు చేస్తారు.