నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకం ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన హాజరైన..జెడ్పీచైర్మన్‌ బడే నాగజ్యోతి,ఐటీడీఏ పీఓ అంకిత్‌

ఏటూరునాగార(జనంసాక్షి)సెప్టెంబర్04.
నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకమని జెడ్పీ చైర్మన్‌ బడే నాగజ్యోతి, ఐటీడీఏ పీఓ అంకిత్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఏటూరునాగారం ప్రెస్‌ క్లబ్‌ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బడే నాగజ్యోతి, పీఓ అంకిత్‌ హాజరై భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి సమాచారం చేరవేయడంలో వారి పాత్ర కీలకంగా ఉంటుందని, సకాలంలో సమాచారం ఇవ్వడం వల్ల వరదల సమయంలో అనేక సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఐటీడీఏ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ది కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు సహకరించాలన్నారు. అలాగే జర్నలిస్టులకు గహలక్ష్మి కింద అర్హులైన వారికి ఇల్లు వచ్చేందుకు కషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సంధ్యారాణి, సీఐ రాజు, ఎస్సై కష్ణప్రసాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ అంతటి విజయ, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, పార్టీ మండలాల అధ్యక్షుడు సునీల్‌కుమార్, రఘు, సత్యం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, ఆత్మ చైర్మన్‌ దుర్గం రమణయ్య, బాదం ప్రవీణ్, కావిరి చిన్నికష్ణ, గుడ్ల దేవేందర్, మల్లారెడ్డి, ఆయూబ్, బాదం ప్రవీణ్, శ్రీనివాస్, ప్రెస్‌ క్లబ్‌ అద్యక్షుడు అఫ్జల్‌పాషా, ప్రధాన కార్యదర్శి అలువాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు నూక ప్రభాకర్, గౌరవ సలహాదారుడు సీహెచ్‌ వెంకన్న, వసంత రమేష్, గోవర్దన్, శేఖర్, బోడ సత్యం, కుదురుపాక రాజేష్, గంపల శివకుమార్, సాయి, రాజు, గోపాల్, వాసు, దామోదర్, తాళ్లపెళ్లి గోపి, వసంత రమేష్, వరప్రసాద్, ప్రతాప్, తేజా, గౌరిశంకర్, భిక్షపతి,శివ లింగప్రసాద్, నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.