*నేడు ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం*

 నేడు మండలానికి ఎమ్మెల్యే రాక
– తెరాస మండల అధ్యక్షుడు రమేష్ స్పష్టీకరణ

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండలంలోని పలు గ్రామాలలో కోదాడ స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఆసరా పెన్షన్ కార్యక్రమం ఉన్నదని మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మండలంలోని గ్రామాల వారీగా నేటి శుక్రవారం తాడ్వాయి, వెంకట్రాంపురం, నేలమర్రి, మాధవరం, నరసింహులగూడెం, రేపాల, సీతానగరo, విజయరాఘవపురం గ్రామాలలో ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఈ కార్యక్రమనికి  మండల తెరాస సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, సింగిల్విండో చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, కార్యకర్తలు పెద్ద హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.