నేడు ఒంగోలులో అఖిలపక్ష నేతల సమావేశం

ఒంగోలు: వాన్‌పిక్‌ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో గుంటూరు జిల్లా నిజాంపట్నంలో అఖిలపక్షరైతులు పాదయాత్ర చేపట్టనున్నారు.