నేడు కళాశాలల బంద్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు బంద్‌ పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్‌, సాయికృష్ణలు తెలిపారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో అభ్యర్థుల పోస్టులు భర్తీ చేయాలని, ప్రైవేట్‌ కళాశాలలో ఫీజుల వసులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న కళాశాలల బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమాన్యాలు, సహకరించాలని విజ్ఞప్తి చేశారు.