నేడు బీసీ సమరభేరి

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం యధాతధంగా కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇదే డిమాండ్‌పై బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బీసీల సమరభేరి నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు.