నేడు విద్యుత్‌ సౌధను ముట్టడించనున్న బీజేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ ముట్టడి కార్యక్రమం ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.