నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
హైదరాబాద్: నేడు ఈ సంవత్సరం మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పనుంది. ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు రెడీ అవుతున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలన్నీ మూతపడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని భాగాల్లో సంపూర్ణంగా కనపడనుంది. అరుణా చల్ ప్రదేశ్ లోని తెజు, రోయింగ్ పట్టణాల్లో చంద్రోదయమైన వెంటనే 4 నిమిషాల 43 సెకండ్ల పాటు కనిపిస్తుందని రీసెర్చ్ అండ్ అకడమిక్ ఎంపీ బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండెమెంటర్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దేబిప్రోసాద్ దువారి తెలిపారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పాక్షింగా గ్రహణం కనపడుతుందని వివరించారు. సాయంత్రం 3.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం 5.27 నుండి 5.32 వరకు సంపూర్ణంగా కనపడుతుంది. అనంతరం పాక్షిక గ్రహణం 7.14 వరకు కొనసాగుతుంది.