నేషనల్ పంచాయతీ అవార్డ్స్ పై సమావేశం
శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 9 మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నేషనల్ పంచాయితీ అవార్డ్స్ పై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ పంచాయతీ అవార్డ్స్ పై మండల పరిధిలోని గ్రామాలలో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కావాల్సిన అంశాలను క్షేత్రస్థాయి అధికారుల ప్రజా ప్రతినిధుల సహకారంతో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కావలసిన తొమ్మిది అంశాలను ఆన్లైన్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్చార్జి ఎంపీడీవో డిప్యూటీ తాసిల్దార్ వ్యవసాయ అధికారి పశు వైద్యాధికారి ఐసిడిఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు