నైస్ ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాల కంప్యూటర్
వరంగల్, జనవరి 19 (): గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు హన్మకొండలోని విద్యార్థి కంప్యూటర్స్ డైరెక్టర్ డి. సుమాదేవి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నైస్ ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాల కింద కంప్యూటర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ట్యాల్లీలో శిక్షణ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్ పాసై 19 నుండి 30 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. తెల్లరేషన్‌కార్డు ఉండి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచింతంగా భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. వివరాలకు 9849103344ను సంప్రదించాలని కోరారు.