న్యూజిలాండ్‌ స్కోరు 148

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సూపర్‌ 8 సిరీస్‌లో ఈరోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాంగ్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 149 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. విలియం సన్‌ 17, రాస్‌ టేలర్‌ 22, ఫ్రాక్లిన్‌ 50 పరుగులు చేశారు. బౌలింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో ఫిన్‌ మూడు, స్వాన్‌, బ్రిగ్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు.