న్యూమెక్సికోలో యువకుని కాల్పులు.. ఐదుగురు మృతి
న్యూమెక్సికో : శాండీహుక్ పాఠశాలలో కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలో మరో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. న్యూమెక్సికోలోని ఓ ఇంటిలో యువకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి అల్బుకర్కీ ప్రాంతానికి సమీపంలోని ఓ నివాసంలో యువకుడు కాల్పులకు పాల్పడినట్లు బెర్నాలిల్లో కౌంటీ పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, మృతులకు యువకునికి గల సంబంధాలు తెలియరాలేదన్నారు. కాల్పులకు పాల్పడిన యువకుని వివరాలను వెల్లడించలేదు. గత డిసెంబర్ 14న న్యూటౌన్‌లోని శాండీహుక్ పాఠశాలలో కాల్పులు చోటుచేసుకొని 26 మంది మృత చెందిన విషయం తెలిసిందే.