పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి. హెగ్డోలి క్లస్టర్ రైతులు.

 

 

 

 

 

కోటగిరి మార్చి 9 జనం సాక్షి:-రైతులు సాగుచేసిన శనగ పంట మొత్తాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని హెగ్డోలి క్లస్టర్ రైతులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గురువారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఏవో శ్రీనివాస్ రావుకి హెగ్డోలి క్లస్టర్ కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.హెగ్డోలి క్లస్టర్ క్రింద దాదాపు 1900 ఎకరాలలో శనగ పంట ,950 ఎకరాలలో సన్ఫ్లవర్,2500 ఎకరాలలో వరి పంటలు వెయ్యడం జరిగిందన్నారు.ఈ సీజన్లో శనగ పంట ఆశాజనకంగా పండడం చేత రైతులకు ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడం జరిగింది.కానీ ప్రభుత్వం ఎకరానికి ఆరు క్వింటాళ్ల శనగలను మాత్రమే కొనుగోలు చేస్తోంది.తద్వారా రైతులు మిగిలిన శనగలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు గురైతు,దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని మోస పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రైతులు ఎంత పంటను పండిస్తే అంతా శనగ పంటని మార్క్ఫడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పంట డబ్బులు జమ చేసే విషయంలో పట్టాదారుల ఎకౌంట్లో కాకుండా కౌలు రైతుల ఖాతాలోనే కౌలు నామ పత్రం ద్వారా పంట డబ్బుల మొత్తాన్ని జమ చేయాలన్నారు.గ్రామంలో పంట నమోదు వివరాల విషయంలో ఒక పంటకి బదులు మరో పంటను నమోదు చేశారు కాబట్టి ఈ పంట నమోదును అధికారులు సరిచేయాలన్నారు.అలాగే గ్రామంలో సన్ఫ్లవర్ పంటను కొనుగోలును ఏర్పాటు చేయాల న్నారు.ఈ వినతి పత్రం అందజేతలో ఏఈఓ ఆస్మా బేగం,హెగ్డోలి క్లస్టర్ రైతులు ఉన్నారు.