పండిట్ రవిశంకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ సితార్ విధ్యాంసుడు పండిట్ రవిశంకర్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం అమెరికాలోని శాండియాగోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 7,1920లో జన్మించిన రవిశంకర్ హిందుస్థాని క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘ భారత రత్నతో’ సత్కరించింది.