పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్‌టైం కంటిన్‌జెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్‌జెంట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శిగా వి.నారాయణ, కోశాధికారిగా కె.రమేష్‌బాబు నియమితులయ్యారు. నూతన కమిటీని ప్రభుత్వం గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.