పదవుల కోసమే అవిశ్వాసానికి తెదేపా దూరం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : పదవుల కోసమే అవిశ్వాస తీర్మానానికి తెదేపా దూరంగా ఉందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెదేపా తీరు చర్చనీయాంశంగా మారిందని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌తో తెదేపా కుమ్మక్కు కాకపోతే ఓటింగ్‌లోనైనా మద్దతు తెలపాలని కోరారు. విపక్షాల మధ్య వైరుధ్యాలున్నా.. కాంగ్రెస్‌ను ఇంటికి పంపించే విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.