పదవ బెటాలియన్ లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు
పదవ బెటాలియన్ లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలుఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 3 : మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియన్ లో కమాండెంట్ బి.రాంప్రకాష్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య ని కొనియాడారు. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడై ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాజు, రాజేష్, రాజారావు, రమేష్ బాబు, శ్రీధర్ తోపాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.