పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లుపై నేడు ఓటింగ్
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాజ్యసభలో నేడు ఓటింగ్ జరగనుంది. ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుడటంతో యూపీఏకు సంకట పరిస్థితి నెలకోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న తమపై కేంద్రం సీబీఐని ప్రయోగించాలని చూస్తోందని ఎప్సీ నేతలు ఆరోపిస్తున్నారు. నేడు ఓటింగ్ నేపథ్యంలో రాజ్యసభలో తమ సభ్యులకు భాజపా వివ్ జారీ చేసింది.