పన్నూర్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

జనం సాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులతో మరియు గ్రామ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో రామగిరి జెడ్పీటీసీ మ్యాధరవెని శారద కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, వార్డు సభ్యులు నాగుల రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయురాలు శోభారాణి, మహిళా అధ్యక్షురాలు చింధం జ్యోతి సతీష్,అంగన్వాడీ టీచర్ చేతి రాజ్యలక్ష్మి, సి ఎ గాజుల వనిత,ఆశావర్కర్లు శిరీష,కోడూరి సమ్మక్క, ఇజ్జగిరి వరలక్ష్మి, తోట పద్మ, ఎంపటి మాళతి, బైరి రామ,శిరీష తదితరులు పాల్గొన్నారు