పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ సూచన

హైదరాబాద్‌: జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ‘పబ్లిక్‌ హియరింగ్‌’ నిర్వహించాలని ఎస్సీ సంక్షేమ కమిటీకి శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు. అసెంబ్లీలోశ్రీనని కమిటీ హాలులో శుక్రవారం జరిగగిన ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు. అత్యాచారం వంటి సంఘటనలు దృష్టికి వచ్చినప్పుడు అవసరమైతే సాక్షులను పిలిచి మాట్లాడాలని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన కమిటీ అని, ఎంతో ఆశతో వచ్చిన వారి ఆర్జీలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎస్సీ ఉపప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.