పరకాలకు తరలిన భాజపా నాయకులు

జిల్లాలోని నలుమూలాల నుంచి సుమారు 2వేల మంది భాజపా నాయకులు పరకాలలో జరిగే ఉప ఎన్ని కల నామినేషన్‌ వేయడానికి భాజపా అభ్యర్థి విజయచందర్‌రెడ్డికి మద్దతుగా నగరం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్ళారు. తరలివెళ్ళిన వారిలో జిల్లా అద్యక్షుడు పెద్దొళ్ల గంగారెడ్డి, బాపురెడ్డి, భూపతిరావు, బాల్‌రాజ్‌, మల్లేష్‌ యాదవ్‌, గెంట్యాల వెంకటేష్‌, పల్నాటి గంగాధర్‌, అల్జాపూర్‌ శ్రీనివాస్‌, భూపతి రెడ్డి, పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్దమొత్తంలో విజయచందర్‌ రెడ్డికిమద్దతుగా జిల్లా నుంచి బయలు దేరారు.