పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.
మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న.
తాండూరు అగస్టు 29(జనంసాక్షి) కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చెరువేంటి ఈశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భజనలు సంకీర్తనలు భక్తిశ్రద్ధలతో భగవంతున్ని స్మరిస్తూ
ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో వెలిసిన పరమేశ్వరున్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఆలయ శాశ్వత ధర్మకర్త వాలి శాంత్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. భక్తి లోనే ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచరణతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాండూరు హిందూవు ఉత్సవ కేంద్ర సమితి కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు , కార్యవర్గ సభ్యులు
ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు