పరిటాల శ్రీరామ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌ నేత హత్యకు కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికొందరిపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.