పలాసలో నారా లోకేశ్‌ బైక్‌ ర్యాలీ

శ్రీకాకుళం,మార్చి26(జ‌నంసాక్షి):   శ్రీకాకుళంలోని పలాస జూనియర్‌ కళాశాల నుండి మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పలాస జూనియర్‌ కళాశాలకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్నారు. అక్కడి నుండి బైక్‌ ర్యాలీగా బయలుదేరారు. పలాస జూనియర్‌ కళాశాల నుండి ఇందిరా చౌక్‌ జీడిపిక్క జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ విూదుగా.. మందస మండలంలోని హరిపురం వరకూ బైక్‌ ర్యాలీ కొనసాగుతోంది. అనంతరం హరిపురంలో ఏర్పాటు చేసిన సభలో నారా లోకేశ్‌ ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌, జిల్లా ఎంపి అభ్యర్థి కె.రామ్మోహన్నాయుడు, పలాస అభ్యర్థి జి.శిరీష, తదితరులు పాల్గొన్నారు.