పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

ఇబ్రహింపట్నం రూరల్‌ , మే 26 (జనంసాక్షి ) మండలంలోని పలు గ్రామాల్లో కోరుట్ల ఎమ్మేల్యే కె.విద్యాసాగర్‌ రావు భూమిపూజ చేశారు.ప్రతి గ్రామానికి త్రాగునీటి ఎద్దడి లెకుండా చూస్తాననా తెలిపారు.వరల్డ్‌ బ్యాంక్‌ నిధులతో .ప్రతి గ్రామా నికి త్రాగునీటిని అందిస్తానన్నారు.ఎన్‌.ఆర్‌ .డి. డ బ్యూ.పి నిధులతో గోధూర్‌కు 2 లక్షలు, తిమ్మా పూర్‌కు 2లక్షలు, యామాపూర్‌కు 2లక్షల  3లక్ష లు,ఎర్దండికు 2లక్షలు,కో.కొత్తూర్‌కు 3.5లక్షలు, ఇబ్రహింపట్నంకు 2లక్షలు, అమ్మక్కపేటకు 3 లక్షలు,మేడిపల్లికి 5లక్షలు, బండాలింగాపూర్‌ (ఒడ్డెర) కు 2లక్షల నిధులతో భూమి పూజ చేశారు.పరకాలలో తెలంగాణదే విజయ మన్నా రు. తెలంగాణ సాధించే వరకు పోరా డు తునే ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మా ర్వో సంపత్‌ కుమార్‌ ,ఎంపిడివో ఆదిరెడ్డి, విద్యుత్‌ ఎ.ఈ జవహర్‌ నాయక్‌,హౌసింగ్‌ ఎ.ఈ రవీం దర్‌, టి.ఆర్‌ .యస్‌ నాయకులు కంతి మోహన్‌ రె డ్డి, రఘుపతిరెడ్డి, బాయిపెద్ద లింగారెడ్డి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.