పవర్‌కట్‌తో సిరిసిల్లలో ఆగిన పవర్‌లూమ్‌లు

ఉపాధికరువై నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల,ఆగస్టు 23(జనం సాక్షి): కరెంట్‌ కోతలు ఈ పదం వింటే చాలు రైతన్న..నేతన్నల గుండెలద రాల్సిందే…కరెంట్‌ కోతలు ఇప్ప టికే రైతుల పుట్టి ముంచగా ఇపుడు నేతన్న బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. ఇప్పటికే చిన్న పరిశ్రమల కార్మికులు రోడ్డునప డగా తాజాగా ఆ జాబితాలోకి నేత న్నలు కూడా చేరారు. గత కొంత కాలంగా నేతన్నల బలవన్మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రభుత్వం ఎడాపెడా కోతల వాతలు పెడ్తుండడంతో పవర్‌ లూములుఆగిపోయి నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు బాధలు ముసురుకోవడంతో ఏంచేయాలో పాలుపోని నేతన్నల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత కొంత కాలంగా ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్లీ మొదలవడంతో ఆందోళన చెందుతున్నారు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్‌ కోతతో బతుకు భారంగా మారి ఓనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల ఇందిరా నగర్‌ కు చెందిన చిట్యాల లక్ష్మినర్సయ్య(55) మరమగ్గాల కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం రెండు లక్షల అప్పు చేసి తన కూతురు లావణ్య వివాహం జరిపించాడు.తెచ్చిన అప్పుకు మిత్తీలు కట్టలేక ఉన్న ఇల్లును అమ్మేశాడు.ఇటీవల కిరాయి మరమగ్గాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.కరెంట్‌ కోతతో జీవనం మరింత బారంగా మారింది.దీంతో కలత చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.మృతునికి భార్య వజ్రవ్వ, కొడుకులు సాయి,వినయ్‌, కూతూరు సౌమ్యలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు