పాక్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం : ఆంటోనీ
న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారతీయ సైనికులకు క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. భారత సైనికుల పట్ల పాక్ ప్రవర్తించిన తీరు అమానవీయంగా ఉందని పేర్కొన్నారు. భారత సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోందని అన్నారు. ఇది దారుణ చర్య అని.. పాకిస్థాన్ సమాధానం చెప్పాలని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ఖుర్దీద్ అన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పాక్ హైకమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. నిన్న జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో గస్తే నిర్వహిస్తున్న భారత సైనికులపై పాక్ దాడి చేసి ఇద్దరిని హతమార్చడంతోపాటు వారి తలలను వేరు చేశారు.