పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నల్గొండ: హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే అధికారులు ఆలేరు వద్ద రైలును నిలిపివేసి మంటలను ఆర్పారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగిలో ప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగానే ఉన్నారు. షార్ట్‌సర్కూట్‌ వల్లే ఈప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.