పాత ఎమ్మెల్యే నివాస సముదాయ విద్యార్థి సంఘాలు ముట్టడి ఉద్రిక్తత

హైదరాబాద్‌: బోధనారుసుముల చెల్లింపులపై ఎమ్మెల్యేలు స్పందించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన పాత ఎమ్మెల్యే నివాస సముదాయ ముట్టగి ఉద్రిక్తతకు దారితీసింది. హిమాయత్‌నగర్‌ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు లోనికి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.