పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాను టిడిపి అధినేత చంద్రబాబు కలిసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని మోడీతో భేటీ అనంతరం వీరి మధ్య చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.