పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాగ్‌రగడ మొదలైంది. కాగ్‌ నివేదికపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ వ్యక్తం చేశాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌, రాజ్యసభ ఛైర్మన్‌ సభలను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నాట్టు ప్రకటించారు.