పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందాయి. పలు చోట్ల ఆస్తినష్టం సంభవించింది.