పుట్టపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు

పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సాయికుల్వంత్‌ మందిరంలో సాయివిద్యాసంస్థల విద్యార్థులు గురువందనం, సంగిత కచేరితో వేడుకలను ప్రారంభించారు. అనంతరం సత్యసాయి సేవాసంస్థల ఉపాధ్యక్షుడు నిమేష్‌పాండేతో పాటు పలువురు ప్రతినిదులు ప్రసాంగించారు. బాబా మహసమాధినిప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి మహసమాధిని దర్శించుకున్నారు.సాయంత్రం మల్లాదిబ్రదర్స్‌సంగీత కచేరి నిర్వహించారు. వేడుకల్లో మంత్రి గీతరెడ్డి, టీవీఎస్‌ గ్రూఫ్‌ సంస్థల చెర్మైన్‌ శ్రీనివాసన్‌, మాజి డీజీపి దొర, సినినటులు అంజలీ దేవి, జమున , గాయని సుశీల, తితిదే మాజి చేర్మెన్‌ అధికేశవులు నాయుడు, ట్రస్టు సభ్యులు ఆర్‌.జె. రత్నకర్‌, చక్రవర్తి, శ్రీనివాసన్‌, ఇందులాల్‌ షా, నాగానంద, తదితరులు పాల్గోన్నారు.