పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, మండలంలోని రుద్రంగి గ్రామంలో వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వ హించారు. మద్యతరగతి,పేద, చిరు ఉద్యోగులను ఇబ్బందులు పాలు చేయడానికి పెట్రోధరలు పెంచారని నాయకులు తీవ్రం గా ఖండించారు. పెట్రోధరల పెంపడంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగాయని నాయకులు వాపోయారు. చమురు కంపెనీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్ముకై విచ్చల విడిగా పెట్రోధరలు పెంచారని, తక్షణం పెట్రోధరలు తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ యువజన విబాగం వేములవాడ నియోజకవర్గ సమన్వ యకర్త ఈర్లపల్లి రాజు, చందుర్తి మండల అధ్య క్షులు చిలుక పెంటయ్య, నాయకులు బొల్లిపల్లి నాగయ్య, అమర బండ శ్రావణ్‌కుమార్‌, మహ్మద్‌ హైదర్‌, ఇస్మాయిల్‌, రాజ్‌ మహ్మద్‌, ఎలగందుల గంగరాజం, గుగులోతు గంగాధర్‌, దయ్యాల నారా యణ, ఎర్రం నర్సయ్య, సంటి బాబురావు, మరాటి మల్లిక్‌, ఈసరి నాంపెల్లి, మార్త గంగాధర్‌,ఆది రవీం దర్‌, ఎరెడ్డి రాజిరెడ్డి, సనుగుల నరేందర్‌, రాజూరి రాజయ్య, కనకయ్య, వైకాపా నాయకులు చెలుకల తిరు పతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, అంబటి శ్రీధర్‌, అభిలాష్‌, నర్స య్య, పొతరాజు రవి, దేవుని మల్లేశం, పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.