పెద్దాపూరంలో రూ. 4లక్షల బంగారం చోరీ

పెద్దాపురం: తూగో జిల్లా పెద్దాపురం పట్టణంలోని పీఅండ్‌ టీ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఆంధ్రాబ్యాంకు విశ్రాంత ఉద్యగి ఎం.పట్టాభి రామారావు ఇంటిలో దొంగలు పడి దాదాపు రూ. 4లక్షల విలువైన 11తులాల బంగారం, పట్టు చీరలు, నగదు ఇతర సామగ్రి చోరి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ కరణం కుమార్‌, కాకినాడ క్లూస్‌ టీం వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.