పెనుమంట్రలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఏలూరు,ఆగస్ట్14(జనం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మార్టేరు రెడ్డి కళ్యాణ మండపంలో మంగళవారం ఖండవల్లి రాజ్యలక్ష్మి జన్మదిన సందర్భంగా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెనుగొండ ఎఎంసి.చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పుట్టిన రోజున ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మంచిదని అభినందించారు. పేదలకు ఉపయోగపడే ఇలాంటి సేవాకార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం వైద్య శిబిరంలో కాకినాడ వారి శ్రీ కిరణ్ కంటి వైద్య నిపుణులచే పేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.


