పెరటి కోళ్ల పెంపకంతో మహిళలకు ఆర్థిక స్వావలంభన – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌


జనం సాక్షి, మంథని : మహిళల ఆర్థిక బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పెరటి కోళ్ల ను పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక మార్పులు జరిగాయని, తెలంగాణ రాక ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుందని నమ్మకంతో వారిని ఆర్థికస్వావలంభన దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహాం అందిస్తోందన్నారు. ఇందులో బాగంగా పెరటి కోళ్ల పంపణీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక మందికి పెరటి కోళ్లను అందించి ఆర్థిక చేయూత నందించామన్నారు. పెరటి కోళ్లకు, వాటి గుడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి ఆలోచన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.