పేదలను విస్మరించడం తగదు

ఖమ్మం, ఆగస్టు 2: పేదలను విస్మరించిన ప్రభుత్వాలు కుప్పకూలి కనుమరుగు కావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. పాల్వంచలో 15 మందికి పైగా ప్రజలకు ఇళ్ల స్థలాలు అవసరమని, వారి కోసం సర్కార్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానన్నారు. గురువారం ఉదయం పాల్వంచలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మురికి వాడల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని అన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడలలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. పాల్వంచలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నదని, ఈ విద్యుత్‌ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, కనీసం ఈ ప్రాంత ప్రజలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు.