పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ — జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి

హన్మకొండ ప్రతినిధి జూన్ 7 జనంసాక్షిఈ నెల 11 న జరుగు ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలనీ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్ష పతి పిలుపునిచ్చారు బుధవారం రోజున దామెర మండలంలో ఓగులాపురం గుడిసల దగ్గర ప్రజా గర్జన గోడ పోస్టర్ ను ముఖ్య అతిధిగా కర్రె బిక్ష పతి హాజరై పోస్టర్ను ఆవిష్కరణ చేశారాని జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొట్టేపాక రవి ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలాలు ప్రభుత్వం… ఏర్పాటు చేయాలని అన్నారు. అంతేకాకుండ అర్హత కలిగిన వారికీ డబుల్ బెడ్ రుములు ఇవ్వాలన్నరు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కట్టేపాక రావన్న మాట్లాడుతూ… ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికీ పట్టాలు ఇవ్వాలన్నారు, గృహలక్షి స్కీమ్ కింద ప్రతి వారికీ పది లక్షలు ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వనికి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు, అదేవిదంగా 58 జీవో ప్రకారం 2020 సంవత్సరం సంబంధం లేకుండా పట్టాలు ఇవ్వాలన్నారు,అంతే కాకుండ 59 జీవో ప్రకారం 500 గజాల లోపు వారికీ నామ మాత్ర ధరతొ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,అర్హులైన వారికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు రానున్న 11 తారీకు రోజున కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో సి పి ఐ నాయకులు అంబి సాంబయ్య, దండు భాస్కర్, రాజేష్, వేల్పుల అఖిల, ప్రమీల, సునీత, మంజుల, గుడికందుల శివకుమార్, సరిత, కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఉన్నారు