పేద మహిళల సంక్షేమమే ద్యేయం :మంత్రి మల్లారెడ్డి

 :శామీర్ పేట్, జనం సాక్షి :
మంగళవారం శామీర్ పేట ఎంపిడిఓ కార్యాలయంలో మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతు.. కళ్యాణ లక్ష్మి పధకం తో సీఎం కేసీఆర్ ఎందరో ఆడ బిడ్డలకు ఆసరా గా ,ఒక తండ్రి లా సహాయం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి పధకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కార్యక్రమం లో మంత్రి మల్లారెడ్డి తో పాటు ఎంపిపి దాసరి ఎల్లుబాయి బాబు,జెడ్పీటీసీ అనితా లాలయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్,ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, ఎంపిటిసి డపు సాయి బాబా,నాయకులు వంగ వెంకట్ రెడ్డి, లాలి, డి బాబు, డి మైసయ్య, బి నర్సింహ రెడ్డి,వంగ నర్సింహ రెడ్డి, చాంద్ పాషా, ఇర్ఫాన్, మేడి రవి, నవీన్ ముదిరాజ్,వజ్జల మురళి, పవన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
21ఎస్పీటీ -1: చెక్ లు అంద జెస్తున్న మంత్రి మల్లారెడ్డి