పేద విద్యార్థులకు నోట్‌ బుక్కుల పంపిణీ

సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : షేక్‌ సాలెహ ఎడ్యూకేషనల్‌ ట్రస్టు నిర్వహకులు పేద విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులు పంపిణీ చేయడం అభినందనీయమని సిరిసిల్ల మజీద్‌ కమిటీ అద్యక్షుడు ఎస్‌కె.యూసుఫ్‌ అన్నా రు. గురువారం బివైనగ ర్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలోని విద్యా ర్థులకు ఉచితంగా బు క్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రతి సంవ త్సరం పేద విద్యార్థు లకు బుక్కులు పంపిణీ చేసి వారిని పరోక్షంగా చదువుకు సహకరించే లా చేస్తున్న ట్రస్టు నిర్వ హకులకు ఆ అల్లాహా మరింత ఐశ్వర్యాన్నిచ్చి సేవ చేసే మనసును రెట్టింపు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రీనా బాబా, సయీద్‌ జహంగీర్‌, అబ్దుల్‌ రశీద్‌, షఫీ ఖాన్‌, సయీద్‌ సాదిక్‌, చాంద్‌ పాషా, ప్రధానోపాధ్యాయురాలు ముంతాజ్‌ బేగం, ఉపాధ్యాయురాల్లు అశ్రబ్‌ బేగం, సన్వీర్‌ సుల్తానా, సీమా బేగం, విద్యార్థులు పాల్గొన్నారు.