పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష అని తెదేపా శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు అయన్ను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమన్నారు.