పోతంగల్లో పివోటి 1977 చట్టానికి తూట్లు. పట్టి పట్టనట్టుగా వవహారిస్తున్న అధికారులు. అసైన్ భూములను ఆక్రమిస్తే ఆర్నెళ్ల జైలు శిక్ష.అయిన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం. జిల్లా కలెక్టర్ కు ప్రజా వాహిణి ద్వారా ఫిర్యాదు.

కోటగిరి ఫిబ్రవరి 7 జనం సాక్షి:-అసైన్డ్ భూములను ఎవరైనా ఆక్రమించిన, బదలాయించిన,కొనుగోలు చేసిన ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండు శిక్షలు కూడా ఉంటాయని అసైన్డ్ భూముల బదలాయింపు చట్టం పీవోటి 1977 స్పష్టం చేస్తున్నది.కానీ పోతంగల్ మండలం లో కొందరు కబ్జాదారులు అవేవీ తమకు పట్ట నట్టుగా చట్టాలు వారికి చుట్టాలు అయినట్లుగా పీవోటి 1977 చట్టానికి తూట్లు పొడుస్తూన్నారు. గతంలో పోతంగల్లోని సర్వే నంబర్ 171 లో రాత్రికి రాత్రే ఇల్లు నిర్మాణానికై స్లాబు వేశారు. అందుకు స్థానిక ప్రజలు డిపిఓ మేడంకు సమాచారం చేరవేయడంతో ఆ ఇల్లు నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది.అయిన పోతంగల్ మండలాలలో అసైన్డ్ భూముల ఆక్రమనలు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయింది. నూతన మండల కేంద్రంగా ఏర్పాటు అయినా పోతంగల్ లో సర్వే నెంబర్ 171,172 లే కాకుండా అనేక అసైన్ భూములు కబ్జా చేసి వివిధ నిర్మాణాలు చేపడుతున్నారు.ఈ విషయమై కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల కు అలాగే ఓల్డ్ కలెక్టర్ రేట్ భవనంలో ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన రాలేదు.ఇకనైనా సంబంధిత అధికారులు నూతనంగా ఏర్పా టు అయినా పోతంగల్ మండలంలో ఉన్నటు వంటి ప్రభుత్వ భూములను పక్కాగా సర్వే చేసి వాటిలో ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేసి నూతన మండలంలో ఎమ్మార్వో, ఎంపీడీవో అలాగే పలు కార్యాలయాల నిర్మాణా నీకై కృషి చేయాలని పలువురు వ్యక్తులు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రేట్ కార్యాలయంలో ప్రజా వాహిణి ద్వారా కలెక్టర్ కి పిర్యాదు చేశారు.ఈ ప్రజావాణి ఫిర్యాదులో గంధపు దత్తు,సుదం అశోక్,తదితరులు ఉన్నారు.